మహిళా దర్శకురాలితో..

Thu,September 19, 2019 10:47 PM

నాగశౌర్య కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా లక్ష్మిసౌజన్య దర్శకురాలిగా పరిచయంకానుంది. మా సంస్థ నిర్మించబోతున్న ఎనిమిదవ చిత్రమిది. అక్టోబర్‌లో చిత్రీకరణ మొదలుపెడతాం. వచ్చే ఏడాది మే నెలలో ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం అని చిత్రబృందం ప్రకటించింది.

420

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles