సొంత కథలో కథానాయకుడు


Sat,May 11, 2019 11:38 PM

naga shaurya new movie opening

నాగశౌర్య కథానాయకుడిగా స్వీయ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రమణతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి నాగశౌర్య కథను అందించడం విశేషం. ఉషా ముల్పూరి నిర్మాత. మోహరీన్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, నందినిరెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. పరశురామ్ గౌరవ దర్శకత్వం వహించారు. నాగశౌర్య మాట్లాడుతూ ఛలో నర్తనశాల తర్వాత మా సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకుడు రమణతేజ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశాడు. నవ్యమైన ఇతివృత్తంతో అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ నెల 13 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం.

70శాతం చిత్రీకరణ విశాఖపట్నంలో జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ఇది. నాగశౌర్య పాత్ర చిత్రణ విభిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది అని దర్శకుడు తెలిపారు. వినూత్న కథా చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉందని కథానాయిక మెహరీన్ చెప్పింది. పోసాని కృష్ణమురళి, సత్య, వి.జయప్రకాష్, కిషోర్, ఎం.ఎస్.భాస్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌రెడ్డి, ఎడిటర్: రీబిహెచ్, ఆర్ట్: రణ్‌కుమార్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కథ: నాగశౌర్య, స్క్రీన్‌ప్లే: రమణతేజ, ఫణీంద్ర, సమర్పణ: శంకర్‌ప్రసాద్.

2180

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles