సీరియస్ లవ్‌స్టోరీ


Sun,January 20, 2019 11:54 PM

naga shaurya back soft roles

ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద తర్వాత శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. వీరి కలయికలో వచ్చిన గత సినిమాలకు పూర్తి భిన్నంగా సీరియస్ ప్రేమకథతో శ్రీనివాస్ అవసరాల సిద్ధం చేసిన కథ నచ్చడంతో నాగశౌర్య ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇండియా, అమెరికా నేపథ్యంలో నాలుగు పాత్రలు ప్రధానంగా ఈ సినిమా సాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన స్నేహితుల జీవితాల్లో జరిగిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది దర్శకుడు ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో నాగశౌర్య పాత్ర చిత్రణ నవ్యపంథాలో సాగుతుందని చెబుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

1407

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles