చైతూ తల్లిదండ్రులకు నేను వీరాభిమానిని!


Sun,October 28, 2018 12:47 AM

naga chaitanya sukumar savyasachi trailer release

నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తన్న చిత్రం సవ్యసాచి. చందూ మొండేటి దర్శకుడు. నిధి అగర్వాల్ కథానాయిక. మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్ర బిగ్ టికెట్‌ను హీరో విజయ్ దేవరకొండ లక్ష రూపాయలకు కొనుగోలు చేశారు. అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ బ్యాడ్ న్యూస్‌తో నిద్రలేచాను. మాకు ఆప్తులైన శివప్రసాద్‌రెడ్డిగారు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు. అక్కినేని అభిమానులంతా మా ఫ్యామిలీ. జనరేషన్ మారుతున్నా మీ సహకారంలో ఎలాంటి మార్పులేదు. కొన్నిసార్లు మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తాను. ఎనర్జీ ఇస్తాను. కొన్ని సార్లు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాను. అయితే మనమంతా ఎప్పుడూ ఇలాగే కలిసి వుండాలి. అభిమానులకు అభిమానులు మా అక్కినేని అభిమానులు.

ప్రతి సినిమాకు అభిమానుల్ని సంతృప్తి పరిచే విధంగా నిజాయితీతో పనిచేస్తాను. ఈ సినిమాకు నా కంటే ఎక్కువ చందు కప్టపడ్డాడు. అభిమానుల్ని సంతృప్తిపరచాలన్న ఆలోచనతో చందు చేసిన సినిమా ఇది. యునిక్ పాయింట్ అయినా కావాల్సిన కమర్షియల్ అంశాలన్నింటినీ మిళితం చేసి ఒక ఆల్ రౌండ్ మూవీని చందు రూపొందించాడు. ప్రేమమ్ లవ్‌స్టోరీతో ఎలా ఎంటర్‌టైన్ చేశామో ఈ సినిమాతోనూ అదే స్థాయిలో ఆకట్టుకోబోతున్నాం. ఆ విషయంలో గట్టి నమ్మకంతో వున్నాం. కీరవాణిగారితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. సౌండ్ ఆఫ్ సవ్యసాచి విడుదలైనప్పడు ఈ సినిమా సౌండే మారిపోయింది. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ కీరవాణి. ఏ సినిమా షూటింగ్ సమయంలో నాకు అమ్మాయిలు ఫోన్ చేయలేదు కానీ ఈ సినిమా షూటింగ్‌కు వెళుతున్నప్పుడు మాత్రం చాలా మంది అమ్మాయిలు ఫోన్ చేసి మాధవన్‌ను చూడటానికి రావచ్చా అని అడిగే వారు.

మాధవన్ సినిమా అంగీకరించినప్పడే సినిమాపై నమ్మకం పెరిగింది. ఆయన సాధారణంగా ఏ సినిమా అంగీకరించరు. కొత్తదనం వుంటేనే అంగీకరిస్తారాయన అన్నారు. మాధవన్ మాట్లాడుతూ ఎట్టకేలకు తెలుగు చిత్రపరిశ్రమకు వచ్చేశాను. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా అది సాధ్యమైంది. తెలుగులో మంచి చిత్రాలొస్తున్నాయి. ఇక్కడ చాలా మంచి నిర్మాతలున్నారు. మైత్రీ మూవీమేకర్స్ వరుసగా సిక్సర్‌ల మీద సిక్సర్‌లు కొడుతోంది. ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది. ఈ చిత్రానికి పనిచేసిన వారంతా సహృదయులే. అందులో చైతూది గోల్డెన్‌హార్ట్. చైతూ తల్లదండ్రులకు నేను వీరాభిమానిని. అలాంటిది తనతో కలిసి నటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. చైతూ ఖాతాలో ఇది మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది. నిధీ అగర్వాల్‌కు ఈ సినిమా లక్కీ ప్రాజెక్ట్‌గా అవుతుంది. చందూతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. అతిని విజన్, పాత్రలను తీర్చిదిద్దినతీరు నాకు బాగా నచ్చాయి అన్నారు.

మంచి స్నేహితులం అయ్యేవాళ్లం..


Naga-Chaitanya.jpg
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చై అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారే తనని కలిసాను. తను నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్విన విధానం నాకు బాగా నచ్చింది. ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ చైతూ అంటే ఇష్టపడతారు. సినిమాల్లో నటులం అయ్యాం కానీ బయట కలిసి వుంటే ఇద్దరం మంచి స్నేహితులం అయ్యేవాళ్లం. నేను డిగ్రీలో వుండగా చైతూను తొలిసారి చూశాను. ఆ సమయంలో నన్ను అన్నపూర్ణలోకి రానిస్త్తారా? లేదా అనుకున్నాను. శివ, గోవిందా గోవిందా చిత్రాలు చూసి నాగార్జున అంటే పిచ్చి ఏర్పడింది. అలాంటి ఆయన కొడుకు అంటే ఎలా వుంటాడో అనుకున్నాను. ఈ రోజు అతని సినిమా వేడుకలో పాల్గొనడం ఆనందంగా వుంది. సవ్యసాచి భారీ విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు. నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ చందూ మొండేటి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. బాహుబలి-2 తరువాత కీరవాణిగారు సినిమా చేసే అవకాశం మాకే దక్కడం ఆనందంగా వుంది అన్నారు.

కొరటాల శివ మాట్లాడుతూ మైత్రీ మూవీస్ నా ఫ్యామిలీ. వారు ఏది చేసినా కమిట్‌మెంట్‌తో ప్యాషన్‌తో చేస్తారు. ప్రతి సినిమాను పెద్ద సినిమా చేయాలని ప్రయత్నిస్తారు. ఈ సినిమా కూడా ఈ సంస్థలో నాలుగవ బ్లాక్‌బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. సవ్యసాచి చాలా పవర్‌ఫుల్ టైటిల్. ట్రైలర్స్ చాలా అద్భుతంగా వున్నాయి. ఇలాంటి కథ రాసిన చందు మొండేటిని ప్రత్యేకంగా అభినందించాలి. ఈ కథకు లెజెండరీ సంగీత దర్శకుడు కీరవాణి తోడైతే ఎలా వుంటుందో ట్రైలర్‌లో చూశాం. నాగచైతన్య చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు అని తెలిపారు. ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ నాగార్జునతో పనిచేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యానో ఈ సినిమాకు అంతే హ్యాపీగా ఫీలయ్యాను. అల్లరి అల్లుడు సినిమాలోని నిన్ను రోడ్డుమీద చూసినాది లగయితు అనే పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేశాం అన్నారు. ఈ కార్యక్రమంలో నిధి అగర్వాల్ , రిశంకర్, మోహన్, రామజోగయ్యశాస్త్రి, కళాదర్శకులు మోనిక, రామకృష్ణ, అనంతశ్రీరామ్, శ్రియా గోపరాజు, తదితరులు పాల్గొన్నారు.

4269

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles