అభినవ దేవదాసుగా..?


Tue,March 12, 2019 11:59 PM

Naga Chaitanya Samantha Majili to release on April 5

గత ఏడాది శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి చిత్రాల్లో నటించారు నాగచైతన్య. ఈ రెండు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందించలేదు. అయితే ఈ ఏడాది మరిన్ని ఎక్కువ చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు చిత్రాల్ని సెట్స్‌పైకి తీసుకొచ్చారు. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీతో పాటు, కె.యస్. రవీంద్ర రూపొందిస్తున్న వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు నాగచైతన్య. తాజాగా ఆయన మరో చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించనున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. భగ్న ప్రేమికుడిగాధగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగచైతన్య అభినవ దేవదాసు తరహా పాత్రలో కనిపిస్తారని, ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా చైతన్య పాత్ర ఉంటుందని సమాచారం. నాగచైతన్య నటిస్తున్నమజిలీ చిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.

979

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles