బాలీవుడ్ రీమేక్‌లో?


Wed,January 2, 2019 12:40 AM

naga chaitanya samantha and shiva niravan majili movie first look

మలయాళ హిట్ చిత్రం ప్రేమమ్ తర్వాత మరో రీమేక్ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు నాగచైతన్య. ప్రస్తుతం శివ నిర్వాణ రూపొందిస్తున్న మజిలీ చిత్రంలో నటిస్తున్నారు నాగచైతన్య. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తరువాత ఈ రీమేక్ చిత్రంలో నటించనున్నట్లు తెలిసింది. ఆయుష్మాన్ ఖురానా, కృతిసనన్, రాజ్‌కుమార్ రావు కీలక పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం బారెల్లీకి బర్ఫీ తెలుగు రీమేక్‌లో నాగచైతన్య నటించబోతున్నాడు. 2017 ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కుల్ని కోన ఫిలిమ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకున్నాయి. ఈ కథ నాగచైతన్యకు సరిపోతుందని, అతనితో రీమేక్ చేయాలనే ఆలోచనలో చిత్ర వర్గాలు వున్నాయాయని, ఇందులో నటించడానికి నాగచైతన్య కూడా సుముఖంగా వున్నట్లు సమాచారం.

1675

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles