సరికొత్తప్రేమకథ


Fri,September 6, 2019 11:20 PM

Naga Chaitanya Sai Pallavi Sekhar Kammula film launched

మానవ భావోద్వేగాల్ని హృద్యంగా ఒడిసిపట్టి వెండితెరపై అందమైన రంగులద్దుతారు దర్శకుడు శేఖర్‌కమ్ముల. మనసును స్పృశించే కథాంశాలతో సెన్సిబుల్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు నిర్మాతలు. రెండు మాసాల క్రితం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల రెండోవారంలో మొదలుకానుంది. అరవైరోజుల నిర్విరామ చిత్రీకరణతో షూటింగ్‌ను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందమైన ప్రేమకథా చిత్రమిదని..నాగచైతన్యతో సాయిపల్లవి తొలిసారి జోడికడుతుండటం ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి కుమార్‌.
Sai-Pallavi

412

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles