కొత్త ప్రయాణం మొదలైంది


Fri,January 19, 2018 10:48 PM

nagachitnya
నాగచైతన్య కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శైలజారెడ్డి అల్లుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను దర్శకుడు మారుతి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కొత్త ప్రయాణం మొదలైంది. మీ అందరి ఆశీస్సులు కావాలి అని ట్విట్ చేశారు. వెన్నెల కిషోర్, కల్యాణి నటరాజన్, శరణ్య, పృథ్వీ, రఘుబాబు, రాహుల్ రామకృష్ణ తదితరుల నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నిజార్ షఫీ, సంగీతం: గోపీసుందర్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సమర్పణ: పీడీవీ ప్రసాద్, కథ, దర్శకత్వం: మారుతి.

929

More News

VIRAL NEWS