ప్రేమ మజిలీ


Wed,February 13, 2019 12:16 AM

naga chaitanya and samantha majili movie teaser 14th february

వివాహబంధంతో ఒక్కటైన తర్వాత నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న చిత్ర టీజర్ విడుదలచేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ ఇది. వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. వైజాగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. నాగచైతన్య, సమంత పాత్రలు, వారి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

నిన్నుకోరి తర్వాత వినూత్నమైన ప్రేమకథతో దర్శకుడు శివనిర్వాణ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కథలోని మలుపులు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నాం. ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నాం. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదలచేస్తాం అని తెలిపారు. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి.

1564

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles