వేసవిలో ‘లవ్‌స్టోరీ’?

Tue,December 3, 2019 11:47 PM

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీవెంక సినిమాస్ ఎల్‌ఎల్‌పి పతాకంపై నారాయణ్‌దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని సమాచారం. ‘ఇటీవల నాగచైతన్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విడుదల చేసిన వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణలోని ఓ టౌన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి తన కలల్ని సాఫల్యం చేసుకునే యువకుడిగా కనిపిస్తాడు. ఆయన పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది. చైతూ-సాయిపల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శేఖర్ కమ్ముల శైలి సున్నితమైన భావోద్వేగాలు, వినోదం కలబోసిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది’ అని చిత్ర బృందం తెలిపింది. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు ముఖ్యపావూతల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోక్షిగఫీ: విజయ్ సి కుమార్, సంగీతం: పవన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

419

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles