నభా నయా కెమిస్ట్రీ


Sun,July 21, 2019 11:59 PM

Nabha Natesh plays the role of Warangal girl in Ismart Shankar film

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో వరంగల్ అమ్మాయిగా మాస్ పాత్రలో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది నభానటేష్. తొలి సినిమాలో సున్నిత మనస్కురాలైన అల్లరి అమ్మాయిగా కనిపించిన నభా నటేష్ ఈ చిత్రంలో అందుకు పూర్తి భిన్నంగా చాందిని అనే ధైర్యవంతురాలైన యువతిగా మాస్ యాటిట్యూడ్‌తో కూడిన పాత్రలో కనిపించింది. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా రామ్, నభా నటేష్ మధ్య టిపికల్ రొమాన్స్, కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నది. దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రత్యేక శ్రద్ధతో ఈ సన్నివేశాల్ని రాసుకున్నారు. చిత్రీకరణ సందర్భంగా రామ్, నభా కెమిస్ట్రీ యూనిట్ అందరికి నచ్చడంతో అనుకున్న వాటి కంటే ఎక్కువ సన్నివేశాల్ని పూరి జగన్నాథ్ రాసినట్లు తెలిసింది. రొమాన్స్‌తో పాటు వీరి కామెడీ టైమింగ్ ఆహ్లాదాన్ని పంచుతున్నది. రామ్, నభానటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాత్రలు కొన్నాళ్లపాటు గుర్తుండిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది నభానటేష్.

384

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles