దిమాక్ ఖరాబ్ చేస్తది!


Sat,April 13, 2019 01:02 AM

nabha natesh hot look in dimaak kharaab song from ismart shankar

రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ దర్శకుడు. డబుల్ దిమాక్ ఉపశీర్షిక. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాతలు. నిధి అగర్వాల్, నభానటేష్ కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో పాట చిత్రీకరణ జరుగుతున్నది. ఇందులో రామ్‌తో కలిసి ఇద్దరు కథానాయికలు పాల్గొంటున్నారు. రామ్‌ను కొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. వాణిజ్య అంశాల మేళవింపుతో అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు. ఇటీవలే ఈ సినిమాలోని దిమాక్ ఖరాబ్ అనే మాస్ పాటకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నిధి అగర్వాల్ లుక్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ పాటలో నర్తిస్తున్న మరో నాయిక నభానటేష్ లుక్‌ను విడుదల చేశారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్‌గునాజి, ఆశిష్‌విద్యార్థి, గెటప్ శ్రీను తదితరులు నటిస్నున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్‌తోట, సంగీతం: మణిశర్మ, సాహిత్యం: భాస్కరభట్ల, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

1270

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles