సైకలాజికల్ థ్రిల్లర్!


Fri,May 10, 2019 12:12 AM

Naa Peru Raja Movie logo and Teaser Relese

రాజ్ సూరియన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నా పేరు రాజా. అశ్విన్‌కృష్ణ దర్శకుడు. ఆకర్షిక, నస్రీన్ కథానాయికలుగా నటించారు. అమోఘ్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై నాజ్ సూరియన్, ప్రభాకర్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగో, టీజర్‌ని గురువారం హైదరాబాద్‌లో చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా రాజ్ సూరియన్ మాట్లాడుతూ కన్నడలో తిరుగుబోతు, జటాయు చిత్రాల్లో నటించాను. నా పేరు రాజా నా మూడవ చిత్రం. కన్నడలో హీరోగా పేరుతెచ్చుకున్న నాకు తెలుగులో సక్సెస్ కావాలని కోరిక అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. కొత్తగా పళ్లైన ఓ జంట మధ్య ఏర్పడే గిల్లికజ్జాల నేపథ్యంలో సినిమా సాగుతుంది. చిత్రీకరణ పూర్తయింది. మరో రెండు నెలల్లో కన్నడ, తెలుగు భాషల్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్‌రెడ్డి, ఆకర్షిక, నస్రీన్, కెమెరామెన్ వెంకట్ పాల్గొన్నారు.

597

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles