హారర్ థ్రిల్లర్ హేజా


Mon,July 8, 2019 12:05 AM

munna kasi and mumait khan starrer heza teaser

మున్నా కాశీ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం హేజా. ముమైత్‌ఖాన్, నూతన్‌నాయుడు, లిజిగోపాల్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. వి.ఎన్.వి క్రియేషన్స్ పతాకంపై కె.వి.ఎస్. ఎన్ మూర్తి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. టీజర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదలచేసింది. మున్నాకాశీ మాట్లాడుతూ మిస్టర్ 7, యాక్షన్ త్రీడీ, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు సంగీతాన్ని అందించాను. తొలిసారి హీరోగా నటిస్తూ నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో ఉత్కంఠను పంచుతుంది. ముమైత్‌ఖాన్ ఈ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నది. హేజా ఎవరు? ఆ పేరు వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఓ యువకుడు తెలుసుకున్న వాస్తవాలేమిటన్నది ఉత్కంఠను పంచుతుంది అని తెలిపారు. ఇదివరకు తెలుగు తెరపై వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా ఉండే చిత్రమిదని నిర్మాత తెలిపారు.

883

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles