కాజల్ చౌకబేరం


Fri,September 6, 2019 11:11 PM

mumbai saga movie kajal agarwal low budget

కథానాయికలు అందుకునే పారితోషికాలు వారి వాణిజ్య సత్తాను తెలియజెపుతాయి. జనాదరణను బట్టి నాయికలు పారితోషికాల్ని డిమాండ్ చేస్తుంటారు. ఒక్కోసారి కథ బాగా నచ్చితే రెమ్యునరేషన్స్ విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తుంటారు. పంజాబీ సొగసరి కాజల్‌అగర్వాల్ ఓ హిందీ సినిమా కోసం పారితోషికంలో త్యాగానికి సిద్ధపడింది. జాన్ అబ్రహమ్ కథానాయకుడిగా ముంబయి సాగా పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నది. సంజయ్‌గుప్తా దర్శకుడు. ఇందులో హీరోయిన్‌గా కాజల్‌అగర్వాల్ నటించనుంది. అయితే కేవలం 30లక్షల పారితోషికం తీసుకునే ఒప్పందంతో ఈ సినిమాకు అంగీకరించిందట కాజల్ అగర్వాల్. ఇటీవలకాలంలో బాలీవుడ్‌కు దూరంగా ఉండటంతో తిరిగి మంచి కథాంశంతో రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందట కాజల్. ఈ కారణంగానే తక్కువ మొత్తం రెమ్యునరేషన్‌తో ఆమె సినిమాకు ఓకె చెప్పిందని అంటున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ విద్యార్థినిగా, వివాహితగా, శక్తివంతమైన మధ్య వయస్కురాలిగా మూడు కాలవ్యవధుల్లో భిన్నకోణాల్లో సాగే పాత్రను పోషించనుంది. అయితే పారితోషికం పరంగా దక్షిణాది చిత్రాల్లో మాత్రం ఈ అమ్మడికి గొప్ప డిమాండ్ ఉంది. ఒక్కోసినిమాకు కోటిన్నరకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నది.

590

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles