సామాజికాంశంతో ‘కోనాపురంలో జరిగిన కథ’

Tue,October 22, 2019 12:08 AM

అనిల్‌ మొగిలి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోనాపురంలో జరిగిన కథ’. అనూష సినిమా పతాకంపై బట్టు అంజిరెడ్డి, మచ్చ వెంకట్‌రెడ్డి నిర్మించారు. కేబీ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రాన్ని నవంబర్‌ 1న విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌, పోస్టర్‌ను సోమవారం హైదరాబాద్‌లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘చిత్ర నిర్మాతలు, హీరో.. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం వారు కావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని మంచి సామాజిక బాధ్యతతో తెరకెక్కించారు. ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. గొప్ప సామాజికాంశాన్ని స్పృశిస్తూ ఈ సినిమాను రూపొందించామని దర్శకుడు కేబీ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో అనిల్‌ మొగిలి, నిర్మాతలు బట్టు అంజిరెడ్డి, మచ్చ వెంకట్‌రెడ్డి, దర్శకుడు కేబీ కృష్ణ, బాల లింగారెడ్డి, మహాదేవుని శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

375

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles