తెలుగు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో న్యూజెర్సీ రాష్ట్రం ఒప్పందం

Thu,September 19, 2019 12:34 AM

తెలుగు సినీ పరిశ్రమకు న్యూజెర్సీతో ఒప్పందం మరో సువర్ణావకాశం. అమెరికాలోని న్యూజెర్సీలో షూటింగ్‌లు జరుపుకునేందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఫిలిఫ్‌ మర్ఫీతో తెలుగు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఇకపై న్యూజెర్సీలో తెలుగు సినిమాల చిత్రీకరణకు సినీ, సాంకేతిక సాయం చేస్తామని గవర్నర్‌ మర్ఫీ పేర్కొన్నారు. చిత్రీకరణలో రాయితీలు కల్పిస్తామన్నారు. ఫిల్మ్‌ అకాడమీ నుంచి తెలుగు రాష్ర్టాల విద్యార్థులకు రాయితీలు కల్పిస్తామని పేర్కొన్నారు. “నేనూ కళాకారున్నే. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్టేజీపై నాటకం వేశాను. ఎవ్వరినైనా ఇట్టే అనుకరిస్తాను. సినిమా ఏ భాషలో అయినా సినిమానే.. అందుకే తెలుగు సినిమా రంగం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా” అని న్యూజెర్సీ గవర్నర్‌ మర్ఫీ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.


అనంతరం టాలీవుడ్‌ నటి సుప్రియ యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తరఫున, ఆ రాష్ట్ర గవర్నర్‌ న్యూజెర్సీ మోషన్‌ పిక్చర్‌ & టెలివిజన్‌ కమిషన్‌ తరఫున ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా గిల్డ్‌ సభ్యులు, నటి సుప్రియ మాట్లాడుతూ ఈ ఒప్పందంతో రెండు రాష్ర్టాల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయన్నారు. పర్యాటకంగా, సాంస్కృతికంగా రెండు రాష్ర్టాల మద్య సంబంధాలు బలపడతాయన్నారు. ముఖ్యంగా న్యూజెర్సీలో కొన్ని చలనచిత్రాలు, డిజిటల్‌ మీడియా కంటెంట్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చులు తగ్గిస్తామని ఆ రాష్ట్రం ఒప్పుకుంది. దీంతో అక్కడి పన్నులు కూడా కొన్ని తగ్గే అవకాశం ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ఈ ఫలక్‌నామా ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీనటుడు మంచు విష్ణు, ఆయన భార్య విరోనిక పాల్గొన్నారు.
Manchu-vishnu

369

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles