రాక్షసత్వంపై పోరాటం

Thu,February 7, 2019 12:44 AM

మోహన్‌లాల్, నయనతార జంటగా నటించిన మలయాళ చిత్రం విస్మయతుంబతు. ఫాజిల్ దర్శకుడు. ఈ చిత్రాన్ని నిర్మాతలు కె. కస్తూరి, సి.హెచ్ సరోజ గంగారామ్ మహాతంత్రం పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాతలు మాట్లాడుతూ మనుషుల్లో ఉండే రాక్షసత్వాన్ని నిర్మూలించడానికి పోరాడే ఓ వ్యక్తి కథ ఇది. శత్రువులపై అతడు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఆపదలో ఉన్న ప్రియురాలిని ఎలా కాపాడుకున్నాడన్నది ఆకట్టుకుంటుంది. మోహన్‌లాల్, నయనతార పాత్రలు, నటన ఆకట్టుకుంటాయి. మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాల్ని జరుపుతున్నాం అని తెలిపారు.

1069

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles