మిఠాయి సరదాలు

Sat,February 9, 2019 12:03 AM

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్‌కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మిఠాయి. ప్రశాంత్‌కుమార్ దర్శకుడు. డా॥ప్రభాత్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్ర థియేట్రికల్ పంపిణీ హక్కులను మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ డార్క్ కామెడీతో సాగే విభిన్నమైన చిత్రమిది. కలల ప్రపంచంలో విహరించే ఇద్దరు యువకుల జీవితంతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయి. స్క్రీన్‌ప్లే ప్రధానంగా నవరసాలను మేళవించి దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. వినూత్న ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని తెలిపారు. భూషన్ కల్యాణ్, రవివర్మ, గాయత్రి గుప్త, అదితీ మైఖేల్ కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక సాగర్, సినిమాటోగ్రఫీ: రవివర్మన్ నీలమేఘం.

1190

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles