వందశాతం వినోదం !


Sun,February 17, 2019 12:29 AM

mithai audio release

రాహుల్‌రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మిఠాయి. ప్రశాంత్‌కుమార్ దర్శకుడు. ప్రభాత్‌కుమార్ నిర్మాత. ఈ నెల 22న విడుదలకానుంది. వివేక్‌సాగర్ స్వరపరచిన ఈ చిత్ర గీతాల్ని యువదర్శకుడు తరుణ్‌భాస్కర్ శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నేను, రాహుల్‌రామకృష్ణ, ప్రియదర్శి మంచి స్నేహితులం. సైన్మా పెళ్లిచూపులు సినిమాలు చేశాం. ఈ ప్రయాణంలో మేమంతా ఈ స్థాయికి వస్తామని అస్సలు ఊహించలేదు. చక్కటి వినోదంతో మిఠాయి చిత్రం అందరిని అలరిస్తుంది అన్నారు. డార్క్‌కామెడీ చిత్రమిది. ఆద్యంతం నవ్వుల్ని పంచుతుంది. రాహుల్, ప్రియదర్శి తమదైన శైలి వినోదాన్ని పండించారు అని దర్శకుడు తెలిపారు. ప్రియదర్శి మాట్లాడుతూ తొలుత స్క్రిప్ట్ విన్నప్పుడు భయమేసింది. రాహుల్‌రామకృష్ణ జాయిన్ అయిన తర్వాత అంతా సర్దుకుంది. వందశాతం గ్యారంటీగా వినోదాన్ని అందించే చిత్రమిది అన్నారు. తాను డాక్టర్ వృత్తిలో వున్నానని, ఈ సినిమాకోసం సంవత్సరం పాటు శ్రమించామని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షఫీ, కమల్‌కామరాజు తదితులు పాల్గొన్నారు.

1098

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles