స్వచ్ఛమైన ప్రేమకథ!


Sat,May 11, 2019 12:03 AM

miss match movie first look poster launched by krish

ఉదయ్‌శంకర్(ఆటగదరా శివ ఫేం) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మిస్ మ్యాచ్. ఎన్.వి. నిర్మల్‌కుమార్ దర్శకుడు. ఐశ్వర్యా రాజేష్ కథానాయిక. అధిరోహ్ క్రియేషన్స్ పతాకంపై జి.శ్రీరామ్, రాజు, భరత్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి ప్రచార చిత్రాన్ని దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మల్‌కుమార్ మేకింగ్ డా॥ సలీమ్ చిత్రంతోనే అర్థమైంది. ఈ సినిమా ఆయనకు అంతకు మించిన విజయాన్ని అందించాలి. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు అంతా నాకు తెలిసిన వాళ్లే అన్నారు.

ఈ చిత్ర కథ విన్నప్పుడే తప్పకుండా చేయాలనుకున్నానని, సినిమా అద్భుతంగా వస్తోందని హీరో ఉదయ్‌శంకర్ తెలిపారు. మంచి కథాబలమున్న సినిమా ఇదని నిర్మాతలు పేర్కొన్నారు. రచయిత రాజేంద్రకుమార్ మాట్లాడుతూ ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, కంచె చిత్రాల స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ తెలుగులో ఇది నా తొలి చిత్రం. ఈ చిత్రానికి భూపతిరాజా కథ అందించారు. గతంలో నేను రూపొందించిన డా॥ సలీం సినిమాకు మించి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మముంది అన్నారు.

1231

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles