మిర్రర్ సందేశం

Mon,February 11, 2019 12:08 AM

శ్రీనాథ్, హరిత జంటగా నటిస్తున్న చిత్రం మిర్రర్. సీ యువర్ సెల్ఫ్ ఉపశీర్షిక. ఏక్మా సాయికుమార్ దర్శకుడు. శ్రీ మల్లిఖార్జున మూవీస్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్ర ట్రైలర్‌ను టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదలచేశారు. ఈ సందర్భంగా అందరికి నచ్చే మంచి సినిమా చేయాలని చిత్రబృందానికి కేటీఆర్ సూచించారు. దర్శకుడు మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలనే సందేశంతో రూపొందిస్తున్న చిత్రమిది. దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక సమస్యను ఆధారంగా చేసుకొని కమర్షియల్ హంగులతో తెరకెక్కించాం. ఓ పల్లెటూరిలో యువతీయువకులు వరుసగా ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఆ మరణాల వెనకున్న మిస్టరీ ఏమిటి? పెద్ద మనుషుల ముసుగులో కొందరు చేసే అక్రమాలేమిటన్నదే ఈ చిత్ర కథ. అశ్లీలతకు తావు లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. సెన్సార్ పూర్తిచేసి మార్చి చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. వినోద్‌రాజ్, అంజనేయులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్. అర్జున్, సినిమాటోగ్రఫీ: కె. అశోక్, సహనిర్మాతలు: డి. లక్ష్మీనారాయణ, తూమ్కుంట అరుణ్, నీలం అశోక్, వినోద్‌రాజ్.

550

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles