స్నేహితుడి పోరాటం

Tue,December 3, 2019 11:45 PM

పవన్‌,శైలజ జంటగా నటిస్తున్న చిత్రం ‘మేరా దోస్త్‌'. జి.మురళి దర్శకుడు. పి.వీరారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 6న విడుదలకానుంది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘స్నేహం గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమిది. ప్రేమజంటను ఏకం చేయడానికి ఓ స్నేహితుడు సాగించిన పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. కుటుంబ అనుబంధాలు, ప్రేమకథకు వినోదాన్ని మేళవించి రూపొందించాం. మంచి సినిమా చూసిన అనుభూతిని ప్రతి ఒక్కరికి పంచుతుంది’ అని తెలిపారు. దాదాపు 150 థియేటర్లలో సినిమాను విడుదలచేస్తున్నామని, కథ, కథనాలు, చిన్నా నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తాయని నిర్మాత అన్నారు. ఈ సినిమాలో నటనకు ఆస్కారం ఉన్న ఓ మంచి పాత్రను పోషించానని హీరోయిన్‌ శైలజ చెప్పింది.

169

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles