ఒదిగి ఉండటమే ఇష్టం..!

Tue,March 12, 2019 12:14 AM

అందాల ప్రదర్శన చేసేవాళ్లే ఎక్కువ అవకాశాల్ని అందుకుంటారనే మాటల్ని తాను విశ్వసించనని చెబుతున్నది మోహరీన్. ప్రతిభను నమ్ముకుంటేనే ఎక్కువకాలం సినిమాల్లో నిలదొక్కుకోగలమని అంటున్నది. కృష్ణగాడివీరప్రేమగాథతో తెలుగులో కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ సొగసరి హ్యాట్రిక్ సక్సెస్‌లతో లక్కీస్టార్‌గా గుర్తింపును సొంతం చేసుకున్నది. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించిన ఎఫ్-2 చిత్రంతో తిరిగి పూర్వవైభవాన్ని దక్కించుకున్నది. పాత్రల ఎంపికలో ప్రస్తుతం తన ఆలోచన విధానం మారిందని చెబుతున్నది మెహరీన్. ఆమె మాట్లాడుతూ కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి తొలినాళ్లలో అందాల ప్రదర్శనతో కూడిన పాత్రల్లో నటించాను. అలాగని గ్లామర్ విషయంలో ఏ రోజు హద్దులు దాటలేదు. ఓ పరిధి మేరకు గ్లామరస్‌గా కనిపించాను. ప్రస్తుతం నాలోని నటిని సంతృప్తిపరిచే సవాళ్లతో కూడిన పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను. విజయాల వల్ల నా వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. ఏమాత్రం గర్వం తలకెక్కలేదు. తొలి సినిమా సమయంలో ఎలా ఉన్నానో ఇప్పటికే అలాగే ఒదిగి ఉండటానికే ఇష్టపడతాను చెప్పింది.

2046
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles