అచ్చమైన తెలుగమ్మాయిలా..

Wed,October 2, 2019 12:06 AM

అభినయప్రధాన పాత్రల ద్వారా ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమని చెబుతున్నది బెంగాళీ భామ మేఘాచౌదరి. మార్షల్ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేసిందీ సుందరి. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ఊరంతా అనుకుంటున్నారు ఈ నెల 5న విడుదలకానుంది.బాలాజీ దర్శకుడు. ఈ సందర్భంగా మేఘాచౌదరి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ఈ సినిమాలో నా పాత్రపేరు గౌరి. సంస్కృతిసంప్రదాయాల మీద ఎంతో గౌరవమున్న, ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన అచ్చమైన తెలుగు అమ్మాయిగా కనిపిస్తాను. ఈతరంలోని ప్రతి అమ్మాయి గౌరీ పాత్రతో కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా నవీన్ రూపంలో మంచి స్నేహితుణ్ణి సంపాదించుకున్నాను. హైదరాబాద్ సంస్కృతి, ఇక్కడ ప్రజల ప్రేమ నాకు బాగా నచ్చింది. జయసుధ, రావురమేష్, కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో హీరోతో పాటు కథానాయికకు కూడా సమప్రాధాన్యత ఉంటుంది. చక్కటి కుటుంబ విలువలు, అనుబంధాలకు దర్పణంలా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది అని చెప్పింది.

648

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles