బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్స్!


Fri,September 6, 2019 11:07 PM

Meeku Matrame Chepta Teaser Released

హీరో విజయ్‌దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న చిత్రం మీకు మాత్రమే చెప్తా. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ ఉపశీర్షిక. దర్శకుడు తరుణ్‌భాస్కర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. షమ్మీర్ సుల్తాన్ దర్శకుడు. అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం విజయ్‌దేవరకొండ ట్విట్టర్ ద్వారా విడుదలచేశారు. నువ్వు స్మోక్ చేయవుకదా, మందు, గంజా..అలవాటు లేవుగా అని కథానాయిక అడిగిన ప్రశ్నలకు నో..నో అంటూ తరుణ్ తొందరపాటుతో సమాధానాలు చెప్పే సన్నివేశంతో సరదాగా టీజర్ ప్రారంభమైంది . నువ్వు చెప్పినవేవీ అబద్ధాలు కాదుగా అని అడగ్గా.. కాదంటూ తడబడుతూ చెప్పడం వినోదాన్ని పంచుతున్నది. మనకు సంబంధించిన రహస్యాలన్నీ స్నేహితులతో పంచుకుంటాం. అది తిరగబడితే జీవితాంతం వాళ్లు మనల్ని ఏడిపిస్తూనే ఉంటారు. మై బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్ అంటూ టీజర్ గురించి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు విజయ్ దేవరకొండ. వినోదాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నటు కనిపిస్తున్నది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో సినిమాను విడుదలచేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. నవీన్ జార్జ్ థామస్, అవంతికా మిశ్రా, వినయ్‌వర్మ జీవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవా, సంగీతం: శివకుమార్, నిర్మాతలు: వర్ధన్ దేవరకొండ, విజయ్‌దేవరకొండ.

234

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles