మధ్యతరగతికి దర్పణం


Tue,December 12, 2017 10:51 PM

mca
పరీక్షలు పూర్తిచేసుకొని ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఎంసీఏ విద్యార్థుల్లా మా సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎంసీఏ మా సంస్థలో మరో గొప్ప చిత్రమవుతుందనే నమ్మకం వుంది అన్నారు దిల్‌రాజు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్, లక్ష్మణ్‌లతో కలిసి ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ఎంసీఏ. మిడిల్‌క్లాస్ అబ్బాయి ఉపశీర్షిక. నాని, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను కథానాయకుడు నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్, టైటిల్‌సాంగ్‌కు అద్భుతమైన స్పందన లభించింది. టీజర్‌కు ముఫ్పైనిమిషాల్లోనే లక్ష వీక్షణలు వచ్చాయి. నాని ప్రతిసారి కొత్త కథాంశాల్ని ఎంచుకుంటూ వినూత్న చిత్రాల్ని చేస్తున్నాడు. భూమిక చాలా రోజుల తర్వాత ఈ చిత్రంతో పునరాగమనం చేయడం ఆనందంగా వుంది. దర్శకుడు వేణుశ్రీరామ్ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చాడు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల స్ఫూర్తితో ఈ కథ అల్లుకొన్నాడు. మధ్యతరగతి జీవితంలోని ఉద్వేగాల్ని ప్రతిబింబించే చిత్రమిది అన్నారు. క్రిస్మస్ సీజన్‌లో ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచే చిత్రమిదని కథానాయకుడు నాని పేర్కొన్నాడు. ప్రతి మధ్యతరగతి వ్యక్తికి, కుటుంబాలకు కనెక్ట్ అయ్యే చక్కటి కథాంశమిదని దర్శకుడు చెప్పారు.

984

More News

VIRAL NEWS