లవ్ సైకాలజీ


Fri,September 7, 2018 11:10 PM

masakali movie release on september 13

సైకలాజికల్ లవ్‌స్టోరీ ఇది. ఓ యువకుడి దృష్టికోణం నుంచి కథ నడుస్తుంది. నవ్యత కలబోసిన నవతరం ప్రేమకథా చిత్రంగా అందరిని అలరిస్తుంది అన్నారు నబి యేనుగుబాల. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం మసక్కలి. సాయిరోనక్, శ్రావ్య, శిరీష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నమిత్‌సింగ్ నిర్మాత. ఈ నెల 13న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ సైకలాజికల్ గేమ్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది. ప్రతి సన్నివేశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. కథానుగుణంగా చక్కటి పాటలు కుదిరాయి. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది అన్నారు. ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ప్రేమలోని కొత్త పాయింట్‌ను ఈ సినిమాలో చర్చించాం. యువతరాన్ని ఆకట్టుకునే అన్ని అంశాలుంటాయి అని నిర్మాత చెప్పారు. కాశీవిశ్వనాథ్, నవీన్‌నేని, దేవదాస్ కనకాల, రాం జగన్, రవివర్మ, లక్ష్మీవాసుదేవన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుభాష్ దొంతి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: నబి ఏనుగుబాల.

2445

More News

VIRAL NEWS