మార్షల్ ప్రేమకథ


Sun,September 8, 2019 08:00 AM

Marshal Movie Release on 13th September

అభయ్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం మార్షల్. మేఘా చౌదరి నాయిక. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకుడు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ నేటి తరం ప్రేక్షకులు నచ్చే నవ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. హీరో అభయ్ పాత్ర వైవిధ్యంగా వుంటుంది. శ్రీకాంత్ చిత్రంలో కీలకపాత్రను పోషించాడు. ఆయన పాత్ర అందరికి నచ్చే విధంగా ఉంటుంది. కేజీఎఫ్ ఫేమ్ రవిబసురి కథ నచ్చి ఈ చిత్రానికి నేపథ్య సంగీతంతో పాటు రెండు పాటలను సమకూర్చాడు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల వారి మెప్పు పొందుతుందనే నమ్మకం వుంది అని తెలిపారు. రష్మి సమాంగ్, సుమన్, వినోద్‌కుమార్, శరణ్య, పృధ్వీరాజ్, రవిప్రకాష్, ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వరికుప్పల యాదగిరి, మాటలు: ప్రవీణ్‌కమార్ బొట్ల.

343

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles