కాజల్ సమర్పించు మనుచరిత్ర


Sat,May 11, 2019 11:38 PM

manu charitra movie opening

శివ కందుకూరి, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న మను చరిత్ర చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. భరత్ పి కుమార్ దర్శకుడు. ఈ సినిమాకు అగ్ర నాయిక కాజల్ అగర్వాల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆపిల్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎన్.శ్రీనివాసరెడ్డి, పి.రాన్సన్ జోసెఫ్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి కాజల్ అగర్వాల్ క్లాప్‌నివ్వగా, సి.కల్యాణ్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు అజయ్‌భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. భావోద్వేగభరితంగా సాగే ప్రేమకథా చిత్రమిది. ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఏ పెయిన్‌ఫుల్ జాయ్ అన్న ఉపశీర్షికతో రూపొందిస్తున్నాం. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, ఆర్ట్: ఉపేంద్రరెడ్డి, సంగీతం: గోపీసుందర్, సమర్పణ: కాజల్ అగర్వాల్.

1268

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles