నాన్న నుంచే నేర్చుకున్నా!


Mon,August 12, 2019 12:14 AM

manmadhudu-2 success meet nagarjuna speach about movie success

కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేసి ఈస్థాయికి వచ్చాను. నటుడిగా నాలో కొత్తదనాన్ని చూసుకోవాలనుకొని మన్మథుడు-2 చిత్రాన్ని చేశాను అని అన్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటించిన మన్మథుడు-2 చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. నాగార్జున, జెమిని కిరణ్ నిర్మాతలు. ఆదివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ చాలాకాలం తర్వాత తెలుగు సినిమాకు 7 జాతీయ అవార్డులు రావడం ఆనందంగా ఉంది. అందులో చి॥ల॥సౌ ఒకటి కావడం..ఆ సినిమా నిర్మాతల్లో నేనూ ఒకరిని కావడం మరింత సంతోషాన్నిచ్చింది. అప్పటి నవతరానికి ఏదో కొత్తదనాన్ని చూపించాలని గీతాంజలి చేశాను. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఆ సినిమాను తొలుత ప్రేక్షకులు ఆమోదించడానికి చాలా సమయం పట్టింది. అన్నమయ్య విడుదలైన తర్వాత మొదటివారం రోజులు నేను, దర్శకుడు రాఘవేంద్రరావు ఎంతో టెన్షన్ పడ్డాం.

11వ రోజు నుంచి ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. అలా అని మన్మథుడు-2 చిత్రాన్ని వాటితో పోల్చడం లేదు. దీనిని యాక్సెప్ట్ చేయడానికి కూడా కొంత సమయం పడుతుంది. సినిమా బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారు అన్నారు.ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన ప్రశ్నలకు నాగార్జున బదులిచ్చారు. సినిమాకు డివైడ్ టాక్ లేదని, అలా ఉంటే వసూళ్లు ఈస్థాయిలో వచ్చేవి కావని చెప్పారు. విజయాన్ని పట్టుకొని అక్కడే ఉండిపోకూడదని, దానిని ఉపయోగించుకొని కొత్తవారికి అవకాశాలిచ్చి ప్రోత్సహించాలన్నారు. ఈ విషయాన్ని తాను నాన్నగారి నుంచి నేర్చుకున్నానని, ఆయన సుదీర్ఘకాలం కెరీర్‌లో కొనసాగడానికి కొత్త కథాంశాల్ని ఎన్నుకోవడమే కారణమని గుర్తుచేశారు. థియేటర్స్ వెళ్లి సినిమా చూశాను. ప్రేక్షకుల స్పందన బాగుంది. నాగార్జున, వెన్నెల కిషోర్, అవంతిక పాత్రలకు చప్పట్లు కొడుతున్నారు. సినిమా అయిపోయాక చిరునవ్వులతో బయటకువస్తున్నారు అని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అన్నారు.

531

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles