మణిరత్నం మల్టీస్టారర్!


Tue,September 12, 2017 11:57 PM

ManiRatnam Started a multi starrer has been picturized with four heroes

maniratnam
ఓకే బంగారం సినిమాతో మణిరత్నం మళ్లీ విజయాల బాట పట్టారు. అయితే ఈ సినిమా తరువాత కార్తీ కథానాయకుడిగా ఆయన రూపొందించిన చెలియా(కాట్రు విలియిడై) ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ సినిమా ఇచ్చిన ఫలితాన్ని దృష్టిలోపెట్టుకుని ఆయన తాజాగా నలుగురు హీరోలతో ఓ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. సరికొత్త నేపథ్యాలతో సినిమాల్ని తెరకెక్కించే మణిరత్నం తాజా చిత్రానికి కూడా ఓ వినూత్నమైన కథని ఎంచుకున్నారని, ఇందులో హీరోలుగా అరవిందస్వామి, శింబు, విజయ్ సేతుపతి, మలయాళ హీరో ఫర్హాద్ ఫాజిల్ నటించనున్నారని తెలిసింది. హీరోయిన్‌లుగా ఇప్పటికే జ్యోతిక, ఐశ్వర్య రాజేష్‌లను ఎంపిక చేసినట్లు సమాచారం. మరో ఇద్దరు కథానాయికల్ని ఎంపిక చేయాల్సి వుంది. కాగా ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనుండగా, సంతోష్ శివన్ ఛాయాగ్రహణ బాధ్యతల్ని నిర్వర్తించనున్నట్లు తెలిసింది.

721

More News

VIRAL NEWS