స్వేచ్ఛ కోసం సమరం


Fri,May 24, 2019 12:31 AM

mangli swechha movie latest update

గాయని మంగ్లీని నటిగా పరిచయం చేస్తూ చెర్రీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సతీష్ నాయుడు నిర్మిస్తున్న చిత్రం స్వేచ్ఛ. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ పర్యావరణానికి చెట్లు ఎంత ముఖ్యమో ఈ సృష్టికి ఆడపిల్ల అంతే ముఖ్యమనే చక్కని సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. స్వేచ్ఛ కోసం ఓ యువతి చేసిన సమరం నేపథ్యంలో సినిమా సాగుతుంది అన్నారు. పాపికొండలు, నర్సాపూర్, అశ్వారావుపేట, పాల్వంచ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాం. త్వరలో సెన్సార్ పూర్తి చేసి జూన్ రెండవ వారంలో విడుదల చేయనున్నాం అని నిర్మాత తెలిపారు.

1586

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles