మార్పును కోరే ఓటర్


Sun,May 26, 2019 11:27 PM

manchu vishnu voter movie to release in june

విష్ణు, సురభి జంటగా నటిస్తున్న చిత్రం ఓటర్. జి.ఎస్.కార్తీక్ దర్శకుడు. జాన్ సుధీర్ పూదోట నిర్మాత. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఎ సర్టిఫికెట్ లభించింది. జూన్‌లో విడుదల చేయబోతున్నారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ చిత్రంపై వస్తున్న ఆరోపణలన్ని అవాస్తవాలు. ఓటు విలువ తెలియజెప్పే చిత్రమిది. వ్యవస్థలో మార్పు రావాలంటే మొదట మారాల్సిందే ప్రజలేనని, రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తే నీతివంతమైన సమాజం ఆవిష్కృతమవుతుందని నమ్మే ఓ యువకుడి కథ ఇది. ఓటర్ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు అనే గొప్ప సందేశం ఉంటుంది. టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రమిది అన్నారు.

913

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles