రాజకీయనాయకులు మారాలి!


Fri,March 15, 2019 11:33 PM

manchu vishnu voter movie teaser released

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఓటర్. రాజకీయ నేపథ్య చిత్రమిది. జీఎస్ కార్తీక్ దర్శకుడు. రమా రీల్స్ పతాకంపై జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. సురభి కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. అహింసా మార్గం ద్వారా ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది. మనం పేదరికంపైన పోరాటం చేశాం కానీ పేదలపైన పోరాటం చేయలేదు. మార్పు మనలో రావాలి. మొదట మనం మార్చాల్సింది దేశంలోని రాజకీయ నాయకులను అని విష్ణు చెప్పే సంభాషణలు భావోద్వేగభరితంగా సాగాయి. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నది. వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంపత్‌రాజ్, నాజర్, పోసాని కృష్ణమురళి, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజేష్ యాదవ్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: జీఎస్ కార్తీక్.

1056

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles