13ఏళ్ల తరువాత?


Wed,February 20, 2019 11:06 PM

Manchu Vishnu Sreenu Vaitla to team up again

2007లో వచ్చిన చిత్రం ఢీ. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనూహ్య విజయాన్ని సాధించి హీరో మంచు విష్ణుకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దాదాపు 13 ఏళ్ల విరామం తరువాత ఈ చిత్రానికి సీక్వెల్‌ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇటీవల వరుస పరాజయాల్ని చవిచూస్తున్న శ్రీను వైట్ల ఈ సీక్వెల్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతం హీరో మంచు విష్ణుతో చర్చలు జరుపుతున్నారని, ఆయన ఓకే అంటే ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుందని, శ్రీను వైట్ల నుంచి తప్పుకున్న గోపీ మోహన్ సుదీర్ఘ విరామం తరువాత కలిసి ఈ చిత్రానికి పనిచేయనున్నారని చిత్ర వర్గాల సమాచారం.

3013

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles