స్టార్స్ ఆసక్తులు, అనుభవాలు..

Thu,September 19, 2019 11:00 PM

గతంలో నేను రియాలిటీ షోలకు భిన్నంగా ఫీట్ అప్ విత్ ది స్టార్స్ ఉంటుంది. ఇదివరకు చేసిన షోలలో అడిగిన ప్రశ్నలేవి ఇందులో ఉండవు. ఆ షోలకంటే స్వేచ్ఛగా, నిష్కల్మశంగా ఈ షో ఉంటుంది. వారి గురించి తెలియని కొత్త అంశాల్ని ఇందులో చెప్పబోతున్నాం. సాధారణంగా టాక్‌షో అనగానే కలర్‌ఫుల్ దుస్తులు, మేకప్‌తో తెరకెక్కిస్తుంటారు. కానీ నైట్‌డ్రెస్‌లో పెద్దగా మేకప్ లేకుండా ఈ షోకు రమ్మని ఆహ్వానించాను. ఆ మాట విని ఆశ్చర్యపోయారు. నిజజీవితంలో వారు ఎలా ఉంటారో అలాగే చూపించబోతున్నాం. స్టార్స్ ఆసక్తులు, ఎంపికలు, ఆహార్యం, బాడీలాంగ్వేజ్, నిత్యజీవితంలో వారి మనస్తత్వాన్ని మాటల ద్వారా ఆవిష్కరించబోతున్నాం. వివాదాలకు తావు లేకుండా చాలా సరదాగా ఉంటుంది.


కొత్త వరుణ్‌ను చూస్తారు..
ఇప్పటివరకు సమంత, వరుణ్‌తేజ్ ఈ షోలో పాల్గొన్నారు. వరుణ్ చాలా కొత్త విషయాల్ని చెప్పాడు. వరుణ్‌ను కొత్త కోణంలో పరిచయం చేస్తుంది. వారి వ్యక్తిగత విషయాల్ని లోతుగా చూపించడం లేదు. ఇందులో అడగాల్సిన ప్రశ్నలకు సంబంధించి నేను కొన్ని ప్రామాణికాల్ని నిర్ధేశించుకున్నాను. వాటికి అనుగుణంగానే సెలబ్రిటీలను ప్రశ్నలు అడుగుతాను. వారికి నాపై ఉన్న నమ్మకాన్ని, భరోసాను చెక్కుచెదరనివ్వను.

నేనెవరో తెలుసుకోవడం కోసం..
రియాలిటీషో కోసం సినిమాలు తగ్గించలేదు. నాకు నచ్చినవి, నాలో ఆసక్తిని కలిగించే వాటన్నింటికి సమయాన్ని కేటాయిస్తున్నాను. నటి, మానవతావాదిగా స్వీయ ఆత్మశోధన చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాను. నేనెవరో తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నాను. మా కుటుంబమంతా సినీ రంగంలోనే ఉంది. ఈ చిత్రసీమలో అవకాశం దొరికితే ఆకాశానికెత్తుంటారు. మనమేమిటో తెలుసుకోకపోతే అధఃపాతాళానికి వెళ్లిపోతాం. అందుకే ఎంత ఎత్తుకు ఎదిగినా నా కాళ్లు ఎప్పుడూ నేలమీద ఉండేలా జాగ్రత్తపడుతుంటాను. సినిమా కథలు వింటున్నాను. అంగీకరించిన తర్వాత చెబుతాను.

విమర్శలు బాధేసింది...
బిగ్‌బాస్‌కు రెండో సీజన్‌కు ప్రయోక్తగా ఉన్న సమయంలో నానిపై వచ్చిన విమర్శలు చూసి బాధేసింది. అలాంటివి తట్టుకొనే శక్తి నాకు లేదు. నేను ట్రోల్స్ సరదాగా తీసుకుంటాను. కొన్ని సార్లు మాత్రం బాధేస్తుంది. నెగెటివ్‌గా ఆలోచించే వారి ప్రేమ నాకు అక్కరలేదు.

432

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles