మనసు చెప్పే కథ!


Wed,December 13, 2017 11:17 PM

Manasuku Nachindi Movie Pre Look Teaser

SandeepKishan
దర్శకత్వం పట్ల మక్కువ ఉందని మంజుల నాతో ఏనాడు చెప్పలేదు. హఠాత్తుగా ఓ రోజు వచ్చి కథ సిద్ధంచేసుకున్నానని, ఆ సినిమాకు తానే దర్శకత్వం వహించబోతున్నట్లు చెప్పింది. ఆమె మాటలు వినగానే థ్రిల్‌గా ఫీలయ్యాను అని అన్నారు సీనియర్ నటుడు కృష్ణ. ఆయన తనయురాలు, నటి మంజుల దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం మనసుకు నచ్చింది. సందీప్‌కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పి.కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్‌ను కృష్ణ విడుదలచేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. కృష్ణ మాట్లాడుతూ ఈ కథ వినలేదు. సినిమా చూడలేదు. కానీ చూసిన వారందరు బాగుందని అంటున్నారు. టైటిల్ బాగుంది. సినిమా అందరి మనసులకు నచ్చాలని కోరుకుంటున్నానుఅని అన్నారు.

మంజలు మాట్లాడుతూ కథానాయికల్ని అందంగా చూపించడంలో రాఘవేంద్రరావు కింగ్. ఈ సినిమా ద్వారా ఆయన స్థానాన్ని నేను సొంతం చేసుకుంటాననే నమ్మకముంది. నాన్నే నా ఆల్‌టైమ్ ఫేవరేట్ హీరో. ఆయనలా ఉండాలనే ఆలోచనతో నటినయ్యాను. కానీ ఏదో అసంతృప్తి నాలో ఉండేది. నాలోని సృజనాత్మకతను సంతృప్తిపరచడం కోసమే దర్శకురాలిగా మారాను. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందంగా, అర్థవంతంగా ఉంటాయి. జనవరి 26న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని చెప్పింది. కృష్ణతో తనది నలభై ఏళ్ల అనుబంధమని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. పూర్తిస్థాయి ప్రేమకథతో తాను చేస్తున్న తొలి చిత్రమిదని సందీప్‌కిషన్ చెప్పారు.

1350

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles