క్యాన్సర్ పరిశోధనలో..


Tue,March 12, 2019 12:06 AM

manasa vacha movie set release on march 15th

తేజస్, కరిష్మా కర్పాల్, సీమా పర్మార్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం మనసా వాచా. ఎం.వి.ప్రసాద్ దర్శకుడు. గణేష్ క్రియేషన్స్ పతాకంపై నిశ్చల్‌దేవా, లండన్ గణేష్ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత నిశ్చల్ దేవా మాట్లాడుతూ లైఫ్‌ైస్టెల్, తులసీదళం చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన నేను కథ నచ్చడంతో నిర్మాతగా మారాను. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం లండన్‌లో జరిపాం. మానవీయ కోణంలో సాగే వినూత్న కథాంశమిది అన్నారు. క్యాన్సర్ వ్యాధిని సులభంగా నయం చేయాలనే సంకల్పంతో పనిచేసే ప్రేమికులకు ఎదురయ్యే కొన్ని అనూహ్య సంఘటనలు సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. ఈ చిత్రం ద్వారా వచ్చే లాభాల్లో సగం క్యాన్సర్ వ్యాధికి ఉచితంగా వైద్యం అందించే సంస్థలకు విరాళంగా ఇవ్వబోతున్నాం అని దర్శకుడు తెలిపారు. తమ ఎం.జి.ఎం సంస్థ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నామని అచ్చిబాబు తెలిపారు.

881

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles