రాజా నరసింహా


Mon,June 17, 2019 11:22 PM

Mammootty action entertainer movie raja narasimha telugufont

మమ్ముట్టి, జై, మహిమా నంబియార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘మధుర రాజా’. వైశాక్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో నిర్మాత సాధుశేఖర్‌ తెలుగులోకి అనువదిస్తున్నారు. జూలైలో ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్‌ హంగులతో ముడిపడిన సందేశాత్మక చిత్రమిది. అసాంఘిక శక్తులపై రాజా నరసింహా ఎలాంటి పోరాటాన్ని సాగించాడన్నది ఆసక్తిని పంచుతుంది. మమ్ముట్టి నటన, పాత్ర చిత్రణ అలరిస్తాయి. ప్రతినాయకుడిగా జగపతిబాబు పాత్ర శక్తివంతంగా ఉంటుంది. సన్నీలియోన్‌పై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం అనువాద పనుల్ని జరుపుతున్నాం. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

1473

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles