నవ్యత నచ్చింది


Wed,December 13, 2017 11:20 PM

Ragavendarrao
మళ్లీ రావా సినిమా బాగుంది. ఆద్యంతం హృదయాన్ని హత్తుకుంది. సుమంత్ అద్భుతంగా నటించాడు అని అన్నారు ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు. సుమంత్, ఆకాంక్షసింగ్ జంటగా నటించిన చిత్రం మళ్లీ రావా. గౌతమ్‌తిన్ననూరి దర్శకత్వం వహించారు. రాహుల్‌యాదవ్‌నక్క నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను వీక్షించిన రాఘవేంద్రరావు పాత్రికేయులతో ముచ్చటిస్తూ నటన, సంగీతం, సినిమాటోగ్రఫీతో ప్రతి విభాగంలో నవ్యత కనిపించింది. హీరోయిన్ ఆకాంక్షసింగ్‌తో చిన్ననాటి పాత్రల్లో కనిపించిన నటుల అభినయం అలరించింది. తొలి సినిమాతోనే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత రాహుల్ ప్రతిభను చాటుకున్నారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మంచి సినిమా ఇది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ తిన్ననూరి, రాహుల్‌యాదవ్ పాల్గొన్నారు.

646

More News

VIRAL NEWS