ప్రేమికుడి సమరం


Sat,May 18, 2019 11:47 PM

malli malli chusa releasing shortly

అనురాగ్ కొణిదెన హీరోగా నటిస్తున్న చిత్రం మళ్లీ మళ్లీ చూశా. హేమంత్ కార్తీక్ దర్శకుడు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ కథానాయికలు. క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. చిత్రకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ స్వేచ్ఛ లేని జీవితం అంటే శత్రువులేని యుద్ధం లాంటిది. ఈ సమాజంలోని ప్రతి ప్రేమికుడు సమరంలో ఒక సైనికుడితో సమానం. స్వచ్ఛమైన ప్రేమను ఆ ప్రేమే గెలిపించుకుంటుంది. ప్రేమను గెలిపించుకున్న సైనికుడిలాంటి ఓ యువకుడి కథ ఇది. తన ప్రేమ కోసం ఓ యువకుడు చేసిన సమరం నేపథ్యంలో సాగుతుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడితో సమానం. మా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ మంచి అనుభూతినిస్తుంది. జీవితం సంతోషంగా వుండాలంటే మన ఆలోచనలు అందంగా వుండాలి. అలాంటి అందమైన ఆలొచనల సమాహారమే మా సినిమా. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియో, జూన్ ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

1106

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles