ప్రేమకథ మెప్పిస్తున్నది

Mon,October 21, 2019 12:02 AM

‘విజయాన్ని సాధించాలనే తపనతో చేసిన సినిమా ఇది. మా ప్రయత్నానికి చక్కటి స్పందన లభిస్తున్నది’ అని అన్నారు అనురాగ్‌ కొణిదెన. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. హేమంత్‌ కార్తిక్‌ దర్శకుడు. కె. కోటేశ్వరరావు నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ ‘నాలోని ప్రతిభను గుర్తించి అవకాశమిచ్చిన నిర్మాత కోటేశ్వరరావుకు రుణపడి ఉంటాను. హృద్యమైన ప్రేమకథగా ప్రతి ఒక్కరిని ఈ సినిమా మెప్పిస్తున్నది’ అని తెలిపారు. ‘తొలి సినిమా హీరోలా కాకుండా అనుభవజ్ఞుడిలా అనురాగ్‌ అభినయాన్ని కనబరిచాడని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కథలోని వినోదం, భావోద్వేగాలు అలరిస్తున్నాయి. వినూత్నమైన పాయింట్‌తో చక్కటి దృశ్యకావ్యంగా హేమంత్‌ కార్తిక్‌ ఈ సినిమాను తెరపై ఆవిష్కరించారు. ఈ వారాంతంలో మరిన్ని థియేటర్లు పెంచుతున్నాం’ అని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సతీష్‌ పాలకుర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతిజవాన్‌, శ్వేతాఅవస్థి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

287

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles