హృదయాన్ని కదిలిస్తుంది

Sun,October 13, 2019 12:13 AM

అనురాగ్‌ కొణిదెన కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. హేమంత్‌ కార్తీక్‌ దర్శకుడు. శ్వేత అవస్థి, కైరవి తక్కర్‌ కథానాయికలు. ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.కోటేశ్వరరావు పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమా ద్వారా మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నా. యువతరం మెచ్చే వైవిధ్యమైన కథ ఇది. ఓ విద్యార్థి జీవితానికి దర్పణంలా ఉంటుంది. తనకు దొరికిన ఓ డైరీ సహాయంతో అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? ఈ క్రమంలో అతను ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడు? అనే అంశాల చుట్టూ దర్శకుడు ఆసక్తికరంగా కథను అల్లుకున్నాడు. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తుంది. శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం, ఎలేంద్ర మహావీర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. మా సంస్థలో వరుసగా సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నాం’ అన్నారు.

200

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles