చింతకింది మల్లేశం కథ

Sun,February 3, 2019 11:21 PM

ఆసు యంత్రాన్ని కనిపెట్టి పద్మశ్రీ పురస్కారాన్ని సొంతం చేసుకున్న చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం మల్లేశం. ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ యాన్ ఆర్డినరీ మ్యాన్ అని ఉపశీర్షిక. ప్రియదర్శి టైటిల్ పాత్రలో నటిస్తుండగా, అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. రాజ్ ఆర్ దర్శకుడు. స్టూడియో 99 ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రాజ్. ఆర్. శ్రీఅధికారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం విడుదల చేసింది. ఈ చిత్ర టైటిల్ లోగోను ఇటీవల ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు. తెలంగాణకు చెందిన మల్లేశం: ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ యాన్ ఆర్డినరీ మ్యాన్ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది.

ఈ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. అగ్గిపెట్టెలో పట్టేంత చీరలను చేసి ప్రపంచాన్ని అబ్బురపరిచిన వ్యక్తి ఆయన. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మల్లేశం సొంతం. అలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాబు శాండిల్య, ప్రొడక్షన్ డిజైనర్: లక్ష్మణ్ ఏలె,సౌండ్ డిజైనింగ్: నితిన్ లుకోస్, సంగీతం: మార్క్ కె. రాబిన్, మాటలు: పెద్దింటి అశోక్‌కుమార్, పాటలు: గోరెటి వెంకన్న, చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వెంకట్ సిద్ధారెడ్డి.

2203

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles