దేశభక్తి నేపథ్యంలో


Mon,May 20, 2019 11:32 PM

Major Chakodhar on G. Seethareddy Production

ఎంతవారలైనా నేను ఊహించిన దానికన్నా పెద్ద విజయాన్ని సాధించింది. నటుడిగా, నిర్మాతగా నాకు చక్కటి సంతృప్తిని మిగిల్చింది. ఈ విజయం అందించిన ప్రోత్సాహంతో మేజర్ చక్రధర్ పేరుతో మరో సినిమాను తెరకెక్కించనున్నాను అని అన్నారు జి.సీతారెడ్డి. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ సమాజంలోని సమస్యలపై ఓ ఆర్మీ మేజర్ సాగించిన సమరంతో మేజర్ చక్రధర్ సినిమా సాగుతుంది. దేశభక్తితో పాటు కుటుంబ విలువలతో ముడిపడి ఉంటుంది. దర్శకుడు, నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తాం. ఎంతవారలైనా చిత్రంలో నా పాత్రకు మంచి స్పందన లభించింది. అచ్చిరెడ్డి, మదన్‌తో పాటు ఇండస్ట్రీలోని పలువురు బాగుందని మెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటుడిగా పలు అవకాశాలు అభిస్తున్నాయి అని పేర్కొన్నారు.

418

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles