సందేశంతో మహిళా కబడ్డీ


Sat,May 18, 2019 11:50 PM

mahila kabaddi movie poster launch

ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం మహిళా కబడ్డీ. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ చిత్ర పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో దర్శకనిర్మాత రామకృష్ణగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు తెలియజేస్తూ స్ఫూర్తివంతమైన కథ ఇది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి స్వయంకృషితో, ధృడసంకల్పంతో జాతీయస్థాయిలో కబడ్డీ ఛాంపియన్‌గా ఎలా ఎదిగిందన్నదే చిత్ర కథాంశం. అందరిని ఆకట్టుకునే సందేశాత్మక ఇతివృత్తమిది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతాం. రాజ్‌కిరణ్ సంగీతాన్నందిస్తున్నాడు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయింది. ఆరు పాటలు అలరిస్తాయి. స్ఫూర్తినిచ్చే కథతో ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది అన్నారు.

638

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles