అభిమానానికి వెలకట్టలేం!

Sun,February 10, 2019 12:15 AM

యాత్ర సినిమా చూసిన ఎంతో మంది ఫోన్ చేసి మీ రుణం తీర్చుకోలేం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి అభిమానంతో మా కష్టానికి ఫలితం లభించినైట్లెంది అన్నారు చిత్ర దర్శకనిర్మాతలు మహి.వి.రాఘవ్, నిర్మాత విజయ్ చిల్లా. దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవితంలో కీలక ఘట్టమైన పాదయాత్రను ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిన యాత్ర చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దర్శకనిర్మాతలు శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.

భావోద్వేగభరిత యాత్ర

నేను భవిష్యత్తులో వందకోట్ల వసూళ్లు చేసే సినిమా తీసినా తీయొచ్చు. ఆ అవకాశాన్ని కాదనలేం. మన పరిశ్రమలో ప్రతి విషయాన్ని అంకెలతో ముడిపెట్టి చూస్తారు. నా దృష్టిలో అభిమానాన్ని, కళను వెలకట్టి చూడలేం. యాత్ర సినిమా చూసిన ఎంతోమంది రాజశేఖర్‌రెడ్డిగారి స్ఫూర్తివంతమైన ప్రస్థానాన్ని చూపించానని అభినందిస్తున్నారు. కొందరూ ఉద్వేగానికిలోనై ఆనందబాష్పాల్ని రాలుస్తున్నారు. హృద్యమైన అంశాలతో సినిమా తీశానని మెచ్చుకుంటున్నారు. భావోద్వేగభరితంగా సాగిన యాత్ర అంటూ ప్రశంసిస్తున్నారు. వై.యస్.ఆర్‌గారికి ఇంతటి అభిమానగణం ఉందని తెలిస్తే ఈ సినిమా తీసే విషయంలో చాలా ఆలోచించేవాణ్ణేమో.

వివాదాలు లేని చిత్రం - నిర్మాత విజయ్ చిల్లా

దర్శకుడు మహి.వి.రాఘవ్ ఈ సినిమా ఇతివృత్తం గురించి చెప్పగానే వెంటనే ఓకే చేశాను. మహానేత స్ఫూర్తివంతమైన యాత్రను వెండితెరపై ఆవిష్కరించడం గొప్ప అవకాశంగా భావించాను. ఈ సినిమా విషయంలో ఇప్పటివరకు ఎక్కడ నెగెటివ్ కామెంట్ రాలేదు. రాజకీయ నేపథ్య చిత్రమనగానే చాలా మంది వివాదాస్పద అంశాలు ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. వై.యస్.ఆర్ ప్రజల కోసం తపించిన వైనాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. ఎలాంటి వివాదాస్పద అంశాలు లేకుండా సినిమా అందరిని మెప్పిస్తున్నది. కలెక్షన్స్ బాగున్నాయి. మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేశాం. అక్కడ కూడా అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దర్శితమౌతున్నది. ప్రేక్షకులందరూ మళ్లీ వై.యస్.ఆర్‌ను సినిమా ద్వారా గుర్తుచేశారని చెబుతున్నారు. మా సంస్థ నిర్మించిన మూడో చిత్రం యాత్ర అందరి ఆదరణ చూరగొనడం ఆనందంగా ఉంది.

1728

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles