ఫిబ్రవరిలో ముహూర్తం!


Wed,October 11, 2017 11:48 PM

maheshbabu
మహేష్‌బాబు 25వ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను చిత్రంలో నటిసున్నారు మహేష్. ఈ చిత్రం తరువాత ఆయన వంశీపైడిపల్లితో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు, సి.అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి నుంచి సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం. తొలుత సంక్రాంతికి చిత్రీకరణ మొదలు పెట్టాలని చిత్ర వర్గాలు భావించాయి. అయితే భరత్ అనే నేను చిత్రీకరణ కారణంగా ఫిబ్రవరి నుంచి ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అమెరికాలో అత్యధిక భాగం చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడిగా పి.ఎస్.వినోద్, సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్ పనిచేయనున్నారు.

846

More News

VIRAL NEWS