నన్ను నేను చూసుకున్నా!


Tue,March 26, 2019 01:25 AM

mahesh babu unveils his wax statue at amb cinemas

నా మైనపు విగ్రహాన్ని చూస్తుంటే సంతోషం, ఉత్సుకత, భయం.. అన్ని ఉద్వేగాలు ఒకేసారి కలుగుతున్నాయి. మాటలు రావడం లేదు అని అన్నారు మహేష్‌బాబు. సింగపూర్‌కు చెందిన మేడమ్ టుసాడ్స్ మ్యూజియం వారు రూపొందించిన తన మైనపు విగ్రహాన్ని సోమవారం హైదరాబాద్‌లో మహేష్‌బాబు స్వయంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ సింగపూర్‌లోని మేడమ్ టుసాడ్స్ గురించి చాలా విన్నాను. వారి మ్యూజియంలో భారతీయ లెజెండరీ నటుల విగ్రహాలు ఉన్నాయి.ఆ స్టార్ల సరసన నా మైనపు విగ్రహం చేరనుండటం గర్వంగా, గొప్ప విజయంగా భావిస్తున్నాను. నా కుటుంబంతో కలిసి ఈ మ్యూజియానికి వెళ్లితీరుతాను. మూడు నెలల క్రితం విగ్రహం పూర్తిగా తయారు కాకముందు కొన్ని ఫొటోలు పంపించారు. వాటిని నా కుటుంబసభ్యులకు, స్నేహితులకు చూపించాను. చాలా మంది ఫొటోషూట్ అనుకున్నారు.
Mahesh-Babu1
అంత సహజంగా మేడమ్ టుసాడ్స్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. గతంలో లండన్ మ్యూజియానికి కుటుంబసభ్యులతో వెళ్లాను. అక్కడి మైనపు విగ్రహాలు చూడగానే ఏదో ఒకరోజు నా విగ్రహాన్ని మేడమ్ టుసాడ్స్ తయారు చేస్తారని అనిపించింది. అది ఈ రోజు నిజమవ్వడం సంతోషాన్నిస్తుంది. ఈ విగ్రహాన్ని నా భార్యాపిల్లల సమక్షంలో విడుదలచేయడం ఆనందంగా ఉంది. ఏడాది క్రితం కొలతలు కావాలని టుసాడ్స్ ప్రతినిధులు వచ్చారు. కానీ ఇంత క్షుణ్ణంగా విగ్రహాన్ని రూపొందిస్తారని ఊహించలేదు. నన్ను నేను చూసుకున్న అనుభూతి కలిగింది. శ్రీమంతుడు సినిమాలో నా లుక్‌ను అనుసరించి ఈ మైనపు విగ్రహాన్ని తయారుచేశారు.

సినిమాలతో బిజీగా ఉండటంతో సింగపూర్ వెళ్లలేకపోయాను. టుసాడ్స్ వారే ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది అని తెలిపారు. అలాగే ప్రస్తుతం నటిస్తున్న మహర్షి సినిమా గురించి మాట్లాడుతూ తన 25వ సినిమా ఇదని, కెరీర్‌లో అతి పెద్ద చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. అలాగే మేడమ్ టుసాడ్స్ ప్రతినిధి అలెక్స్ మాట్లాడుతూ మహేష్ అభిమానుల మధ్య విగ్రహాన్ని విడుదల చేయాలనే హైదరాబాద్‌లో ఆవిష్కరించాం. ఆరునెలల పాటు ఇరవై మంది సభ్యులు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారుచేశారు. మహేష్‌బాబుకు సంబంధించి 200 కొలతలు తీసుకున్నాం. షారుఖ్‌ఖాన్, అమితాబ్‌బచ్చన్ తర్వాత మహేష్‌బాబు విగ్రహాన్ని విడుదలచేయడం సంతోషంగా ఉంది అని చెప్పారు. ఇద్దరు మహేష్‌లను ఒకేసారి చూస్తున్న అనుభూతి కలుగుతుందని నమ్రతా శిరోద్కర్ చెప్పింది. ఈ వేడుకలో మహేష్ పిల్లలు గౌతమ్, సితార పాల్గొన్నారు. ఈ విగ్రహాన్ని సింగపూర్‌కు త్వరలోనే తరలించనున్నట్లు తెలిసింది.

1826

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles